

భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబై నుంచి శాశ్వతంగా బెంగళూరుకు మారిపోయారు. లోయర్ పరెల్ నుంచి ట్రైనింగ్ సెంటర్లకు రోజూ ప్రయాణించడం అలసటగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు శివారులో నివాసం తీసుకున్న ఆయన, ఇకపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను తన పూర్తి సమయ శిక్షణ, రిహాబిలిటేషన్ కేంద్రంగా ఉపయోగించనున్నారు. ఇలా సీ ఓ ఈను ఏడాది పొడవునా హై పెర్ఫార్మెన్స్ హబ్‌గా ఉపయోగిస్తున్న తొలి భారత క్రికెటర్‌గా పాండ్యా నిలిచారు.
ఈ మార్పుతో పాటు ఆయన కొత్త 12 కోట్ల ఫెరారీ 12సిలిండ్రి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్ టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారు ఆకుపచ్చ రంగులో ప్రత్యేకంగా ఉంది. 819 హార్స్‌పవర్ వి12 ఇంజిన్‌తో ఈ కారు 2.9 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇప్పుడు బెంగళూరులో స్థిరపడిన పాండ్యా, తన ప్రొఫెషనల్ శిక్షణతో పాటు లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో కూడా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!