
జనరల్

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రీమియం డిబెంచర్ సీట్ల ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. నివేదికల ప్రకారం, ఈ ప్రత్యేక వీఐపీ సీట్ల ధర సుమారు 5 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.4.6 కోట్లు)గా ఉండటంతో క్రీడాభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ మొత్తాన్ని ఒక్క మ్యాచ్ టికెట్ కోసం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డిబెంచర్ హక్కుతో కొనుగోలుదారుడు వరుసగా ఐదేళ్ల పాటు వింబుల్డన్ టోర్నమెంట్ ప్రతి రోజూ అదే ప్రీమియం సీటులో మ్యాచ్‌లను వీక్షించే అవకాశం పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ అభిమానుల మధ్య ఈ ప్రత్యేక ప్యాకేజ్ చర్చనీయాంశంగా మారగా, సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్, సరదా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!