

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి టీ20లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. ఐర్లాండ్ సిరీస్‌లో కూడా అవకాశం రాకపోవడంతో, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా ఈ మ్యాచ్‌లోనూ వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
భారత్ జట్టు బౌలింగ్ విభాగంలో రెండు కీలక మార్పులు చేసింది. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడిన ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గేలను తప్పించి రవి బిష్ణోయ్, గాయం నుంచి కోలుకున్న వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. భారత్ తుది జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఇంగ్లండ్ తుది జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహ్మూద్.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!