

మాజీ భారత క్రికెటర్ అజింక్య రహానే తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన రోజులను తాజాగా గుర్తు చేసుకున్నారు. 2011లో భారత జట్టులో చోటు దక్కినా టెస్టు అరంగేట్రం కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో టీమిండియా సుమారు 20 టెస్టులు ఆడినా తాను 12వ ఆటగాడిగానే కొనసాగానని వెల్లడించారు. అయితే సానుభూతి కోరుకోవడం కంటే తన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టానని తెలిపారు. జట్టు కోసం మంచినీళ్లు అందించడం వంటి బాధ్యతలను కూడా ఎలాంటి సంకోచం లేకుండా నిర్వర్తించానని పేర్కొన్నారు.
మరోవైపు విరాట్ కోహ్లీ-రవిశాస్త్రి జోడీ భారత టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిందని రహానే అభిప్రాయపడ్డారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ ఆటగాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడని, అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చి ప్రోత్సహించేవాడని చెప్పారు. జీవితంలోనూ, క్రీడల్లోనూ దీర్ఘకాల విజయానికి ఓర్పు అత్యంత ముఖ్యమని పేర్కొన్న రహానే, ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణించిన రోజుల నుంచే సహనాన్ని అలవర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!