

2026 ఏషియన్ గేమ్స్‌కు ముందు భారత క్రికెట్ జట్టు జపాన్ చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. భారత్ సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు జపాన్‌తో సుజుకి కప్ పేరుతో ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, జపాన్ పురుషుల జట్లు తొలిసారి తలపడనుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఏషియన్ గేమ్స్‌కు ముందు భారత ఆటగాళ్లకు ఇది సన్నాహక మ్యాచ్‌గా ఉపయోగపడనుంది.
జపాన్‌తో టీ20లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉండటంతో యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. అభిషేక్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్ తర్వాతి స్థానాల్లో ఆడవచ్చు. అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ పేస్ బాధ్యతలు చేపట్టగా.. రవి బిష్ణోయ్ స్పిన్ విభాగాన్ని నడిపించే అవకాశం ఉంది. జపాన్ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.
భారత్ అంచనా తుది జట్టు: వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!