

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ కార్యక్రమం ఆసక్తికరంగా మారింది. సామాన్యుల్లోని ప్రతిభను గుర్తించి వారిలో కొందరికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయిన ఉప్పల్ బాలు.. తనను నవదీప్, బిందు మాధవి తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. వారు తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం వైరల్ కావడంతో నవదీప్ ఓ వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయమని, విమర్శలను తట్టుకుని కష్టమైన పరిస్థితుల్లో తమను తాము ఎలా కాపాడుకోగలరో తెలుసుకోవడమే అగ్ని పరీక్ష ఉద్దేశమని చెప్పారు.
తాజాగా ఉప్పల్ బాలు మరో వీడియో విడుదల చేశారు. అయితే ఈసారి ఎలాంటి ఆరోపణలు చేయకుండా బిగ్ బాస్ నిర్వాహకులకు నేరుగా విజ్ఞప్తి చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే హౌస్‌లోకి వెళ్లి తానేంటో నిరూపించుకుంటానని తెలిపారు. బిగ్ బాస్‌ను ఉద్దేశించి ఇదే తన చివరి వీడియో అని కూడా చెప్పారు.
తన పర్ఫార్మెన్స్‌తో టీఆర్పీ రేటింగ్ పెంచుతానని, ఎలాంటి స్కిట్ ఇచ్చినా ప్రేక్షకులను అలరిస్తానని ఉప్పల్ బాలు అన్నారు. అలాగే ఎలాంటి టాస్క్ ఇచ్చినా చాలా కష్టపడి ఆడతానని తెలిపారు. రెగ్యులర్ ఎంట్రీ అవకాశం లేకపోతే కనీసం వైల్డ్ కార్డ్ ద్వారా అయినా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించాలని కోరారు. తన అభిమానులు కూడా తాను హౌస్‌లోకి వెళ్లాలని కోరుకుంటున్నారని చెబుతూ బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునను కూడా రిక్వెస్ట్ చేశారు. మరి ఉప్పల్ బాలు విజ్ఞప్తిని బిగ్ బాస్ టీమ్ పరిగణనలోకి తీసుకుని ఆయనకు అవకాశం ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!