

అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రస్తుతం పలు వివాదాలు, కంటెస్టెంట్ల కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. షో నుంచి ఎలిమినేట్ అయిన కొంతమంది బయటకు వచ్చి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే ఉప్పల్ బాలు జడ్జ్‌లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా.. తాజాగా మరో కంటెస్టెంట్ బెబ్జాన్ తన వ్యక్తిగత జీవితం, షో అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తన బ్రేకప్ గురించి మాట్లాడిన బెబ్జాన్.. ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు బాగుందని చెప్పింది. బ్రేకప్ సమయంలో జీవితంపై ఆశ కోల్పోయేంతగా కుంగిపోయానని, ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని వెల్లడించింది. అయితే ఆ కష్టమైన దశను అధిగమించి, సింగిల్‌గా ఉన్న సమయంలో తనను తాను కొత్తగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. గతంలో అమాయకంగా, ప్రపంచం గురించి పెద్దగా తెలియని వ్యక్తిగా ఉన్న తాను.. బ్రేకప్ తర్వాత వ్యక్తిత్వపరంగా ఎంతో మారానని తెలిపింది.
అగ్నిపరీక్ష షోపై వస్తున్న ఆరోపణలపైనా బెబ్జాన్ స్పందించింది. డబ్బులు చెల్లిస్తే షోలో అవకాశాలు ఇప్పిస్తామని వచ్చే ఫేక్ కాల్స్ గురించి తనకు ఎలాంటి అనుభవం లేదని, అవి నకిలీవి అయి ఉండవచ్చని తెలిపింది. షో నిజాయితీగానే జరుగుతుందని స్పష్టం చేసింది. కొందరికి జడ్జ్‌లు సమయం ఇవ్వకుండా పంపించారనే ఆరోపణలపై స్పందిస్తూ.. జడ్జ్‌లకు నచ్చే వ్యక్తిగత వైబ్ ఉంటుందని, ఆ వైబ్ మ్యాచ్ అయిన వారికే ఎక్కువ సమయం ఇస్తారని చెప్పింది. ఇందులో ఫేవరిజం లేదని, తమకు నచ్చిన వారిని వారి వైబ్ ఆధారంగా ఎంపిక చేస్తారని బెబ్జాన్ అభిప్రాయపడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!