

బిగ్‌బాస్ సీజన్ 10కు ముందు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ ఆడిషన్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కామన్ మ్యాన్ కేటగిరీలో ఆడిషన్స్‌కు హాజరైన నిఖిల్ సెలక్షన్ ప్రక్రియ, నిర్వాహకుల తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, 200 మందికి పైగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి వివిధ దశల్లో ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. అయితే అభ్యర్థులను గంటల తరబడి క్యూలో నిలబెట్టి, చివరికి జడ్జిల ముందు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని నిఖిల్ అన్నారు.
తెలుగు బిగ్‌బాస్ ఆడిషన్స్ అయినప్పటికీ, నిర్వాహకులు తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడాలని ఒత్తిడి చేశారని నిఖిల్ ఆరోపించారు. తాను ఫిట్‌నెస్ ట్రైనర్, పవర్‌లిఫ్టర్ అని చెప్పడంతో పాటు తన నైపుణ్యాలను ప్రదర్శించినప్పటికీ, సరైన వివరణ ఇవ్వకుండా ‘3 రెడ్స్’ ఇచ్చి తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ విషయాలను వివరిస్తూ నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కామన్ మ్యాన్‌కు బిగ్‌బాస్ హౌస్‌లో అవకాశం కల్పిస్తున్నామని చెప్పే ఆడిషన్స్ నిజంగా పారదర్శకంగా ఉన్నాయా అని నిఖిల్ ప్రశ్నించారు. సాధారణ అభ్యర్థులను టీఆర్‌పీ, ప్రమోషనల్ కంటెంట్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, ఆడిషన్ టీమ్‌లో ఉన్న నవదీప్ నిఖిల్‌కు “Good Luck Brother” అంటూ వ్యక్తిగతంగా మెసేజ్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. నిఖిల్ ఆరోపణలపై బిగ్‌బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!