
గాసిప్స్

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. గతంలో ఉన్న గడువులోగా ప్రక్రియను పూర్తి చేయడంలో పలువురు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం వంటి సాంకేతిక కారణాలతో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడంలో కస్టమర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో వారికి మరింత సమయం కల్పిస్తూ గడువును పొడిగించారు.
ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు తమ సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా లేదా సంబంధిత అధికారిక యాప్‌ల ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వినియోగదారులు పొడిగించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!