

కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డివైన్ ఫాంటసీ డ్రామా ‘మూక్కుత్తి అమ్మన్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2020లో విడుదలై ఘన విజయం సాధించిన ‘మూక్కుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మొదటి భాగానికి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించగా, రెండో భాగాన్ని ‘అరణ్మణై’ చిత్రాల దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నటి రెజీనా కాసాండ్రా ప్రతినాయక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం దర్శకుడు సుందర్ సి ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త లుక్‌తో శక్తివంతమైన పాత్రను రూపొందించినట్లు సమాచారం. నయనతార దైవిక పాత్రలో కనిపించనుండగా, ఆమెకు ప్రతిగా రెజీనా పోషించే నెగెటివ్ రోల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుందని టాక్. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఐషరి కె. గణేష్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు కూడా సమాచారం. సుందర్ సి మార్క్ కామెడీ, ఫాంటసీ అంశాలతో పాటు నయనతార, రెజీనా మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!