

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై గాసిప్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా పలువురు సెలబ్రిటీల పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ రామ్ ప్రసాద్, నరేశ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టీవీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎంట్రీ ఇస్తే షోలో కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ మరింత పెరిగే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
మరోవైపు సీరియల్ నటి కావ్యశ్రీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఆమె బిగ్‌బాస్ తెలుగు 10లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఇక ప్రముఖ యాంకర్ చార్మిలను కూడా బిగ్‌బాస్ టీమ్ సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమె నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉందట. ఈ పేర్లు నిజంగానే ఫైనల్ లిస్ట్‌లో చేరితే.. బిగ్‌బాస్ తెలుగు 10లో కామెడీ, టీవీ, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో మంచి సందడి ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!