

బిగ్ బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి ఎంపికై హౌస్‌లోకి అడుగుపెట్టిన రోహిత్.. ప్రశాంతమైన ప్రవర్తన, మెచ్యూరిటీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. హౌస్‌లోకి రాకముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. విజయవాడకు చెందిన రోహిత్ గత 15–16 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. మంచి జీతంతో ఐటీ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, చిన్నప్పటి నుంచి ఉన్న బిగ్ బాస్ కలను నెరవేర్చుకోవడంతో పాటు తన తల్లి కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నట్లు చెప్పాడు.
అగ్ని పరీక్షలో రోహిత్ ప్రదర్శించిన ప్రశాంతత, మెచ్యూరిటీ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. టాస్క్‌ల సమయంలో తోటి కంటెస్టెంట్లను ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా రాజకుమారికి ధైర్యం చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అగ్ని పరీక్ష ఫైనలిస్టుల్లో ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎంపికై బిగ్ బాస్ తెలుగు 10లో 15వ కంటెస్టెంట్‌గా రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత త్రిగుణ్‌తో విభేదాలు, టాస్క్‌లలో అతడి ఆటతీరు చర్చనీయాంశంగా మారాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!