

బిగ్‌బాస్ తెలుగు 10లో గత వారం సృష్టి వ్యాకరణం ఎలిమినేట్ కావడంతో ఇప్పుడు ఈ వారం నామినేషన్స్‌పై ఆసక్తి నెలకొంది. మొత్తం 10 మంది కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తుండటంతో ఎవరికి ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా ఉందనే అంశం కీలకంగా మారింది. తాజాగా వైరల్ అవుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం అపూర్వ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అపూర్వకు ప్రస్తుతం తక్కువ ఓట్లు వస్తున్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయని, దీంతో ఈ వారం ఎలిమినేషన్ ముప్పు ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్లలో ఆమె కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి కేవలం ఓటింగ్ ట్రెండ్స్ మాత్రమే కావడంతో తుది ఫలితం అధికారికంగా వెల్లడయ్యే వరకు ఎవరూ ఎలిమినేషన్‌పై స్పష్టమైన నిర్ణయానికి రాలేరు. మరోవైపు కమెడియన్ నరేష్ ఈ వారం ఓటింగ్‌లో ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఫలితం ఎలా ఉండబోతుందనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!