

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొలి వీకెండ్ ఎపిసోడ్ శనివారం సందడిగా సాగింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించారు. తప్పులు చేసిన వారిని ప్రశ్నిస్తూనే బాగా ఆడిన వారిని అభినందించారు. తనదైన పంచ్‌లు, సరదా సంభాషణలతో హౌస్‌లో నవ్వులు పూయించారు. మొదట కాస్త సీరియస్‌గా కనిపించడంతో హౌస్‌మేట్స్ భయపడగా, ఆ తర్వాత నవ్వుతూ వారితో సరదాగా మాట్లాడారు.
రాంప్రసాద్, నరేశ్ కలిసి హౌస్‌లో కంటెస్టెంట్ల ఆటతీరుపై ఇచ్చిన సరదా రివ్యూలను నాగార్జున వీక్షించి ఇద్దరినీ అభినందించారు. అయితే రాంప్రసాద్‌తో పోలిస్తే నరేశ్ తన అభిప్రాయాలను మరింత హార్ట్‌ఫుల్‌గా చెప్పాడని పేర్కొన్నారు. అనంతరం అగ్నిపరీక్ష తర్వాత అసలైన మహాపరీక్ష మొదలైందని గుర్తుచేశారు. హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్లలో కొందరు ఇప్పటికే హౌస్‌మేట్స్‌గా మారగా, మరికొందరు ఎలిమినేట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో ఉన్నారని చెప్పారు.
చరణ్, చైత్రలు ఇంకా సీక్రెట్ రూమ్‌లో ఉన్నారా అనే అనుమానాలపై నాగార్జున వారితో మాట్లాడించారు. చరణ్ షాలినీతో మాట్లాడి ఆమె బాగా ఆడుతోందని, అదే విధంగా కొనసాగాలని ధైర్యం చెప్పాడు. చైత్ర ముకేశ్‌తో మాట్లాడి అతడు చెప్పిన మాట విని ఉంటే బాగుండేదని చెప్పింది. మరోవైపు రోహిత్, రాంప్రసాద్, టెంపర్ వంశీ బాగా ఆడుతున్నారని ప్రశంసిస్తూ వారికి మిల్క్‌షేక్‌లు పంపించారు. వారు తాగిన గ్లాసులను నాగార్జున స్వయంగా కడిగి, ఏ పని చిన్నది కాదని, ఏ పని తక్కువది కాదని సూచించారు.
ముకేశ్, త్రిగుణ్, వర్షిణిలలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా హౌస్‌మేట్‌గా మారనుండగా, చివరకు నాలుగో హౌస్‌మేట్‌గా త్రిగుణ్ ఎంపికయ్యాడు. రోహిత్, త్రిగుణ్ ప్రవర్తనపై నాగార్జున అసహనం వ్యక్తం చేసి, త్రిగుణ్‌తో రోహిత్‌కు క్షమాపణ చెప్పించారు. అనంతరం అతడికి పనిష్‌మెంట్ విధించారు. తెలుగులో మాట్లాడుతున్న బేబ్‌జానీని ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, రాంప్రసాద్ తన మాటతీరును నియంత్రించుకోవాలని సూచించారు. షాలినీకి సారీ చెప్పేందుకు రాంప్రసాద్‌తో 500 సార్లు “సారీ” రాయించారు. చివర్లో లాస్ట్ హౌస్‌మేట్‌గా దేబ్జానీ ఎంపికైనట్లు ప్రకటించడంతో బిగ్‌బాస్ హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!