
షోస్

ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో అత్యధికంగా 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురం భీం జిల్లా రెబ్బెనలో 96.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
వరంగల్ జిల్లా రాయపర్తిలో 95.8 మిల్లీమీటర్లు, వర్ధన్నపేటలో 82.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!