4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

Writer: Chandrika 12:06 AM, 4 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10 తాజా వీకెండ్ ఎపిసోడ్‌ హౌస్‌లో జరిగిన పరిణామాలపై హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను నిలదీయడంతో తీవ్ర ఉత్కంఠగా సాగింది. గత వారం టాస్కుల్లో శ్రుతిమించిన ప్రవర్తన, ఫిజికల్‌ అగ్రెషన్‌, వ్యక్తిగత వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన భాష, బిగ్ బాస్ నిబంధనల ఉల్లంఘనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటలో పోటీ ఎంత ఉన్నా.. హౌస్‌లో కొన్ని హద్దులు తప్పక పాటించాలని కంటెస్టెంట్లకు స్పష్టం చేశారు.

రోహిత్‌ విషయంలో నాగార్జున తీవ్రంగా స్పందించారు. చరణ్‌తో రోహిత్ మాట్లాడిన సమయంలో బిగ్ బాస్‌, హౌస్‌ గురించి చులకనగా మాట్లాడినట్లు చూపించిన ఓ అన్‌సీన్‌ వీడియోను నాగార్జున ప్రదర్శించారు. అనంతరం చరణ్‌ను కూడా ప్రశ్నించి జరిగిన సంభాషణపై వివరాలు తెలుసుకున్నారు. రోహిత్‌ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తొలుత హౌస్‌ నుంచి బయటకు వెళ్లాలని సూచించిన నాగార్జున.. రోహిత్‌ క్షమాపణ చెప్పిన తర్వాత యెల్లో కార్డ్‌ ఇచ్చి హెచ్చరించారు. ఫిజికల్‌ టాస్కుల్లో ప్రవర్తనపై అమన్‌, త్రిగుణ్‌లకు కూడా వార్నింగ్స్‌ ఇచ్చారు.

ముకేశ్‌ మాట్లాడిన తీరుపైనా నాగార్జున ప్రశ్నలు సంధించారు. కెప్టెన్సీకి సంబంధించిన వ్యాఖ్యలు, మాటల తీరుపై వివరణ కోరారు. మరోవైపు కెప్టెన్‌ అపూర్వ వ్యవహరించిన తీరుపై కూడా నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. కెప్టెన్‌ రూమ్‌ను ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసినట్లు కనిపించిన అంశంపై ఆమెను ప్రశ్నించారు. శాలిని కూడా గొడవల సమయంలో ఉపయోగించిన అభ్యంతరకరమైన పదజాలంపై నాగార్జున నుంచి క్లాస్‌ తీసుకున్నారు. హౌస్‌లో మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

టాస్కుల్లో అతిగా వ్యవహరించిన అమన్‌కు నాగార్జున మరోసారి గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఇలాంటి ప్రవర్తన మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. త్రిగుణ్‌ ప్రవర్తనపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నామినేషన్లపై హౌస్‌లో చర్చించవద్దన్న నిబంధనను ఉల్లంఘించిన రామ్‌ప్రసాద్‌ను కూడా నాగార్జున ప్రశ్నించారు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని రామ్‌ప్రసాద్ వివరణ ఇచ్చినప్పటికీ, ముందే నిబంధన చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తుచేసి తుది హెచ్చరిక ఇచ్చారు. అదే సమయంలో రామ్‌ప్రసాద్ అందిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రశంసించారు.

మొత్తంగా ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటే కంటెస్టెంట్ల ప్రవర్తన, హౌస్‌ నిబంధనలు ప్రధానంగా నిలిచాయి. తప్పు చేసిన కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ప్రశ్నించిన నాగార్జున.. ఫిజికల్‌ అగ్రెషన్‌, వ్యక్తిగత వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన భాష, నిబంధనల ఉల్లంఘనలను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. వరుస వార్నింగ్స్‌, యెల్లో కార్డులతో హౌస్‌లో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. ఇకపై కంటెస్టెంట్ల ఆటతీరు ఎలా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?
ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ సీజన్ 10నాగార్జున్బిగ్ బాస్ తెలుగు వీకెండ్ ఎపిసోడ్రోహిత్ నాయుడుఅమన్త్రిగుణ్అపూర్వశాలినిరామ్ ప్రసాద్బిగ్ బాస్ హౌస్బిగ్ బాస్ తెలుగు రివ్యూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క
జనరల్

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్
రాజకీయాలు

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..
సినిమాలు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...
బిజినెస్

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..
సినిమాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...
క్రీడలు

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్
రాజకీయాలు

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..
ఓటీటీ

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..