

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ముగింపు దశకు చేరుకోవడంతో.. బీబీ10లో నేరుగా అడుగుపెట్టే టికెట్ కోసం పోటీదారుల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. తాజా ఎపిసోడ్‌లో ‘రాక్ ది ఫ్లోర్’ టాస్క్ నిర్వహించారు. ఇందులో ఒక్కో టాస్క్ ద్వారా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ చివరకు విజేతగా నిలిచిన వారికి బీబీ10 టికెట్ దక్కనుంది. తొలి దశలో షాలినీ విజయం సాధించి వైల్డ్ ఫైర్ కార్డ్‌ను సొంతం చేసుకుంది. అయితే మిథిలేష్‌తో జరిగిన టాస్క్‌లో ఆమె ఆ కార్డును ఉపయోగించడంతో జ్యూరీ ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టింది. కఠినమైన టాస్క్ కోసం కార్డును దాచుకోవాల్సిందని సూచించింది. రీసెట్ చేసిన టాస్క్‌లో షాలినీ గెలిచినా.. తర్వాత రాజ కుమారి చేతిలో ఓడిపోయింది.
మరోవైపు రాజ కుమారి వరుస విజయాలతో బీబీ10 టికెట్ రేసులో ముందంజలో నిలిచింది. రంగుల టాస్క్‌లో షాలినీని ఓడించిన ఆమె.. అనంతరం చరణ్‌తో జరిగిన ఈకలు ఊదే టాస్క్‌లోనూ విజయం సాధించింది. తొలి టాస్క్‌లో ప్రియాంక పోటీ నుంచి తప్పుకోగా.. మిథిలేష్, హేమంత్ కూడా తమ తమ టాస్కుల్లో సత్తా చాటారు. ప్రస్తుతం రాజ కుమారి బలమైన పోటీదారుగా కనిపిస్తుండగా.. ‘రాక్ ది ఫ్లోర్’ టాస్క్ తదుపరి ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. చివరికి బీబీ10 టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!