

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో సీజన్‌ను డిఫరెంట్‌గా నడిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హౌస్‌లో కామనర్లకు అవకాశం కల్పించేందుకు నిర్వహించిన అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే దశకు చేరుకుంది. మొత్తం 13 మంది కంటెస్టెంట్లు ఈ తుది పోటీలో పాల్గొంటున్నారు.
ఫినాలేలో మేకర్స్ ప్రకటించిన గోల్డెన్ టికెట్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది. టాస్కుల్లో విజయం సాధించే కంటెస్టెంట్‌కు గోల్డెన్ టికెట్ లభించి, నేరుగా బిగ్ బాస్ 10 తెలుగు హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అగ్నిపరీక్షలో ఆట, మాటతీరుతో ఆకట్టుకున్న సింగర్ ఝాన్సీ పేరు ఇప్పటికే బలంగా వినిపిస్తోంది. ఆమెకు బిగ్ బాస్ బెర్త్ ఖరారైందనే ప్రచారం ఉన్నప్పటికీ, గోల్డెన్ టికెట్ ఎవరు గెలుస్తారనే విషయంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!