
గాసిప్స్

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. రోశయ్య నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడని జగన్ కొనియాడారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రోశయ్య చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని జగన్ పేర్కొన్నారు. రోశయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!