
జనరల్

ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై వస్తున్న అపోహలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఇంజిన్ దెబ్బతింటుందనే ప్రచారం, మైలేజ్ భారీగా తగ్గిపోతుందనే వాదనలు, వారంటీ రద్దవుతుందనే సందేహాలు, నీటి వినియోగం, కీటకాలు ఆకర్షితమవుతాయనే ప్రచారం వంటి అంశాలన్నింటికీ శాస్త్రీయ ఆధారాలతో వివరణ ఇచ్చింది. ఈ20 ఇంధనం ఇప్పటికే పలు దేశాల్లో విజయవంతంగా వినియోగంలో ఉందని కేంద్రం తెలిపింది.
అలాగే ఈ20 వినియోగం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడం, కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం, రైతులకు అధిక ఆదాయం లభించడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని వెల్లడించింది. 2025 డిసెంబర్ నాటికే దేశం 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని చేరుకుందని, ఇది పరిశుభ్రమైన ఇంధన వినియోగ దిశగా కీలక విజయమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!