

నటి నభా నటేష్ తన కెరీర్లో అనుకోకుండా వచ్చిన విరామానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మెట్లపై నుంచి జారి పడిన సమయంలో తలకు గాయం కాకుండా పక్కకు పడటంతో పక్కటెముకలకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. చికిత్సలో భాగంగా శరీరంలో రాడ్లు, స్క్రూలు అమర్చాల్సి వచ్చిందని, వైద్యుల సూచన మేరకు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ఒకేసారి పలు సినిమాలకు దూరమయ్యానని చెప్పారు.
ఆ కష్టకాలాన్ని వృథా చేయకుండా పెయింటింగ్, పాటలు పాడటం, శిల్పకళ, పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం వంటి అభిరుచులతో గడిపానని నభా తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసికంగా, శారీరకంగా మరింత బలంగా మారానని చెప్పారు. ప్రస్తుతం ఆమె మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉండగా, తాజా చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!