
జనరల్

అఖిల్ అక్కినేని హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున కూడా పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్, నాగార్జున, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపిస్తే సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!