
జనరల్

హైదరాబాద్‌లో ఆహార కల్తీని అరికట్టేందుకు హెచ్-ఫాస్ట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత 100 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో 185 కల్తీ కేసులు నమోదు చేసి, సుమారు 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!