

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. క్రెడిట్ చోరీ, ఓట్ల చోరీ, డేటా చోరీ అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. చివరకు తమిళనాడు ప్రభుత్వంలోనూ చోరీలకు పాల్పడ్డారంటూ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఉద్యోగాల నుంచి తొలగించిన వ్యక్తులకు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని జగన్ ఆరోపించారు.
తమిళనాడులో ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారికే మంత్రి నారా లోకేశ్ దగ్గరుండి ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పించారని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘దొంగల ముఠా’ దారుణాలకు పాల్పడుతోందంటూ విమర్శించారు. చివరగా ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా!’ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత వర్గాల స్పందన తెలియాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!