

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విశాఖ సమ్మిట్లో చేసిన విప్లవాత్మక నిర్ణయంపై పరిశ్రమల దిగ్గజం ఆనంద్ మహీంద్రా మరోసారి ప్రశంసలు కురిపించారు. పెట్టుబడి పెట్టే కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలను నేరుగా అందించే విధంగా ఎస్క్రో అకౌంట్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించడం దేశంలోనే తొలి ప్రయత్నంగా నిలిచింది. ఈ విధానం బ్యాంకుల వద్ద జరిగే ఆలస్యాలను తొలగించి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందని అంచనా.
ఈ ప్రకటనను పంచుకుంటూ ఆనంద్ మహీంద్రా, చంద్రబాబును అభివృద్ధిపై ఆసక్తితో పాటు వినూత్న విధానాలను తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా అభివర్ణించారు. ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో భారీ స్పందనను రాబడుతోంది. పలువురు నెటిజన్లు, ఇంతటి విజన్ ఉన్న చంద్రబాబు ప్రధాని పదవిపై ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నిస్తూ, ఆయన నాయకత్వం దేశవ్యాప్త మార్పుకు దారి తీస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!