
జనరల్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పనుల్లో బెంగాలీ భాషకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల్లో స్థానిక భాష వినియోగాన్ని పెంచి ప్రజలకు సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని శాఖలకు ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ చర్య భాషా గౌరవాన్ని పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అధికారిక పత్రాలు, వ్యవహారాల్లో బెంగాలీ వినియోగం పెరగడం ద్వారా ప్రజలతో అనుసంధానం మరింత బలపడుతుందని తెలిపారు. ఈ విధానం అమలుకు సంబంధించిన మరిన్ని మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!