
జనరల్

శస్త్రచికిత్స అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పూల బొకేలు అందజేసి డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంగా కనిపించిన పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్‌కు మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో ఘన స్వాగతం పలికారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై పలు రాజకీయ, పార్టీ వ్యవహారాలపై చర్చించనున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!