

ఢిల్లీలో తెలంగాణ మంత్రులతో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీల అతిపెద్ద పండుగ అయిన మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం, సాంస్కృతిక విశిష్టతపై దాదాపు పది నిమిషాల పాటు చర్చ జరగగా, సమ్మక్క–సారలమ్మల పోరాట గాథపై సీతక్క వివరాలు తెలియజేశారు.
సమ్మక్క–సారలమ్మల చరిత్రను ఆసక్తిగా విన్న రాహుల్ గాంధీ, దేశవ్యాప్తంగా ఈ కథను చాటేలా సినిమా తీయాలని సూచించారు. సమావేశంలో సరదాగా మాట్లాడుతూ, జాతరకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఖర్గే కూడా తల్లుల దర్శనానికి వచ్చేవాడినని తెలిపారు. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు మంత్రి సీతక్క వివరిస్తూ, వచ్చే జాతరకు అధికారిక ఆహ్వానం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆహ్వానం అందితే తప్పకుండా హాజరవుతామని రాహుల్ గాంధీ, ఖర్గే తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!