

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం నిరసన చేపడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై చేపడుతున్న చర్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థులపై లాఠీచార్జ్, అరెస్టులు, అణచివేతకు వ్యతిరేకంగా సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు రాహుల్ ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
విద్యార్థులపై పోలీసుల చర్యలు ఢిల్లీలో జరిగినా, తెలంగాణలో జరిగినా ఒకే విధంగా ఖండించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులను కూడా రాహుల్ ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేయాలని సూచించారు. విద్యార్థుల హక్కుల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!