

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నప్పటికీ.. ఆయన వ్యవహరిస్తున్న తీరు పిరికివాడిలా, బెదిరించే వ్యక్తిలా, అప్రజాస్వామికంగా ఉందని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా అస్తవ్యస్త పరిస్థితులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
‘ఓటు చోరీ’ అంటూ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆరోపణలు చేస్తున్నారని, కానీ తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేశారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే ఆధారాలతో అనుముల కుటుంబ అవినీతిపై ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నేత కృష్ణాంక్ మన్నెను అరెస్టు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని నియంత్రించాలని రాహుల్ గాంధీని కోరిన కేటీఆర్.. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఆపాలని డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!