

పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మూడో సీజన్ నుంచి వైదొలిగింది. జట్టులోని ఆటగాళ్లకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనే విషయంపై జట్టు యాజమాన్యం పీసీబీతో చర్చలు జరిపినా, సమస్య పరిష్కారం కాకపోవడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీకి దూరమైంది. దీంతో డబ్ల్యూసీఎల్ ఆరు జట్లతో కొనసాగనుంది.
ఈ వివాదానికి గతేడాది డబ్ల్యూసీఎల్‌లో చోటుచేసుకున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల పరిణామాలే నేపథ్యంగా నిలిచాయి. పాకిస్థాన్ ఛాంపియన్స్ గత సీజన్‌లో ఫైనల్‌కు చేరి దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. అంతకుముందు సీజన్‌లోనూ పాకిస్థాన్ ఛాంపియన్స్ రన్నరప్‌గా నిలిచింది. తాజా నిర్ణయంతో ప్రస్తుత సీజన్‌లో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ ఛాంపియన్స్ మ్యాచ్ కూడా రద్దు కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!