

సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావునగర్ బెల్వర్డి గార్డెన్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఉప సభాపక్ష నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఎన్నికల సంఘం నిర్ణయాలు ఉండకూడదని అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం తగిన బాధ్యతతో వ్యవహరించలేదని ఆయన విమర్శించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల స్థాయి అధికారులుగా సరైన అవగాహన లేని వారిని నియమించడం వల్ల అనేక ప్రాంతాల్లో గందరగోళం నెలకొందని తలసాని ఆరోపించారు. ఈ ప్రక్రియలో లక్షలాది మంది ఓట్లు తొలగించబడ్డాయని పేర్కొన్నారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికే ఉన్న ఓటర్లను తొలగించడం లేదా మళ్లీ నమోదు చేయడం కాకుండా, కొత్తగా అర్హత పొందిన ఓటర్ల నమోదుకే ఈ ప్రక్రియను పరిమితం చేయాలని డిమాండ్ చేశ



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!