
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం 13 కార్పొరేషన్లలో టీడీపీ ఏడు చోట్ల ఆధిక్యంలో ఉండగా, జనసేన ఒక కార్పొరేషన్‌లో ముందంజలో ఉంది. 87 మున్సిపాలిటీలకు సంబంధించి టీడీపీ 39 చోట్ల, జనసేన ఏడు చోట్ల, బీజేపీ ఒక చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,020 వార్డులకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులోనూ టీడీపీ ముందంజలో ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీడీపీ 600 వార్డుల్లో, జనసేన 26 వార్డుల్లో, వైఎస్సార్‌సీపీ 21 వార్డుల్లో, బీజేపీ 13 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ ఆధిక్యాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తుది ఫలితాలు వెలువడిన తర్వాతే పూర్తి ఎన్నికల ఫలితాలపై స్పష్టత రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!