

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా.. ఇప్పటివరకు వెల్లడైన తొలి ఫలితాల్లో కూటమి అభ్యర్థులు పలు ప్రాంతాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి 125 ఓట్ల ఆధిక్యం సాధించారు. జీవీఎంసీలో మొత్తం 747 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గానూ తెదేపాకు 351, వైఎస్సార్‌సీపీకి 226, ఇతరులకు 170 ఓట్లు పోలయ్యాయి.
ఇక చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 15 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. అవన్నీ తెదేపా ఛైర్మన్ అభ్యర్థి రాజ్‌కుమార్‌కే దక్కాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్‌కు 16, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విరితా దేవికి 3 ఓట్లు వచ్చాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కూటమి అభ్యర్థి గుండుమల శారద 16 ఓట్లతో ముందంజలో ఉన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో కూటమి అభ్యర్థికి 45, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 31, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు వచ్చాయి. మరోవైపు కడప మేయర్ ఎన్నికలో తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెదేపాకు 47, వైఎస్సార్‌సీపీకి 36, ఇతరులకు 14 ఓట్లు పోలయ్యాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!