

బిగ్‌బాస్ తెలుగు 10లో నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో కొత్త వివాదాలకు తెరలేపింది. ముఖ్యంగా వర్షిణి, రాంప్రసాద్, నరేష్ మధ్య స్నేహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బయట పరిచయం ఉండటంతో పాటు హౌస్‌లోనూ సన్నిహితంగా కనిపించిన ఈ ముగ్గురి మధ్య నామినేషన్లతో విభేదాలు బయటపడ్డాయి. వర్షిణి తన స్నేహితుడైన నరేష్‌ను నామినేట్ చేయగా, రాంప్రసాద్ కూడా వర్షిణిని నామినేట్ చేశాడు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది. స్నేహం పేరుతో మోసం చేసుకున్నారంటూ పరస్పరం విమర్శలు చేసుకోవడం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విభేదాలు కేవలం గేమ్ వ్యూహంలో భాగమా, లేక వ్యక్తిగత మనస్పర్థలా అన్నది ఆసక్తికరంగా మారింది.
నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి వర్షిణి, ముకేష్, అమన్, వంశీ, నీతూ, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ కలిపి మొత్తం పది మంది ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. గత వారం ఎలిమినేషన్ ప్రమాదం నుంచి చివరి నిమిషంలో బయటపడిన వర్షిణి మరోసారి నామినేషన్లలోకి రావడంతో ఆమె ప్రయాణంపై చర్చ మొదలైంది. ఈసారి ప్రేక్షకుల ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో, ఎవరు హౌస్‌ను వీడాల్సి వస్తుందోనని ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!