

భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’. బాలీవుడ్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదట ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా రణబీర్ కపూర్, నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలతో మూడో భాగం కూడా ఉండవచ్చనే చర్చ మొదలైంది.
ఈ కథను రెండు భాగాలకే పరిమితం చేయకుండా మూడో సినిమాగా కూడా కొనసాగించే అవకాశం ఉందని మేకర్స్ హింట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలోనే ఉందని, ప్రేక్షకుల స్పందనను బట్టి తదుపరి ప్రణాళికలపై నిర్ణయం తీసుకుంటామని నమిత్ మల్హోత్రా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ తదితరులు కూడా నటిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!