

ఢిల్లీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నిరసనల వల్ల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ అక్కడి వ్యాపార సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌లో కన్నాట్ ప్లేస్ (సీపీ)లోని వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయని, నిరసనల కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నాయి. తమ వ్యాపారాలకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టి న్యాయం చేయాలని కోర్టును కోరాయి.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఇతర సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది. నిరసనకారులు, ఆందోళనలను నిర్వహిస్తున్న వారిని కూడా పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చాలని సూచించింది. వారిని కేసులో చేర్చకుండా సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కుల పేరుతో ఎవరూ నిరసన ప్రాంతాలను నిరవధికంగా ఆక్రమించలేరని, సమాజంలోని ఇతరుల ఇబ్బందులను కూడా గుర్తించాలని వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరికీ తమ సమస్యలపై గళమెత్తే హక్కు ఉందని పేర్కొంది. సామూహిక నిర్బంధాలు, పోలీసుల బలప్రయోగం, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు సంబంధించిన పిటిషన్లను కూడా కోర్టు విచారించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!