

తయారీ రంగానికి చెందిన బీఎల్‌ఎస్ పాలిమర్స్ మంగళవారం స్టాక్ మార్కెట్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ.150తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో 65.33 శాతం ప్రీమియంతో రూ.248 వద్ద లిస్ట్ అయ్యాయి. బీఎస్‌ఈలోనూ 62.73 శాతం లాభంతో రూ.244.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ అంచనాలను మించి నమోదైన ఈ బంపర్ లిస్టింగ్‌తో ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు మంచి లిస్టింగ్ లాభాలు లభించాయి.
బీఎల్‌ఎస్ పాలిమర్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 27న ప్రారంభమై 29న ముగిసింది. ఒక్కో షేరుకు రూ.142–150 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించగా, మొత్తం 241.22 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను గోవాలోని తయారీ కేంద్రం విస్తరణకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించాలని సంస్థ నిర్ణయించింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!