

ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో ప్రతి ఒక్కరికీ రూ.8,000 దీపావళి బోనస్ ఇస్తున్నారంటూ ఓ నకిలీ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందిస్తోందని, మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని అందులో పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దీపావళి బోనస్ ప్రకటించలేదని వెల్లడించింది.
సైబర్ నేరగాళ్లు ఇలాంటి సందేశాల ద్వారా ప్రజల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేస్తే పేరు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలతో పాటు ఓటీపీ, యూపీఐ పిన్ వంటి సున్నితమైన సమాచారం అడిగే అవకాశం ఉంది. ఈ వివరాలు ఇతరులకు అందిస్తే బ్యాంక్ ఖాతాలోని డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి గుర్తుతెలియని లింకులను తెరవకూడదు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ చెప్పకూడదు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!