
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చికిత్స నిమిత్తం రేపు ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వైద్యులు చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం.
వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్‌కు రేపు సాయంత్రం చికిత్స నిర్వహించనున్నట్లు తెలిసింది. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి విశ్రాంతి తీసుకుని తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!