
జనరల్

మంత్రి కొండా సురేఖ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రికి కూడా మంత్రి హోదాలో తెలియజేసినట్లు పీసీసీ చీఫ్‌కు వివరించారు.
కొండా సురేఖ విజ్ఞప్తిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కడియం శ్రీహరి–కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇరు వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించినట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!