
సినిమాలు

టి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డిలో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కామారెడ్డికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
అయితే తాను కామారెడ్డికి వెళ్లి తీరుతానని రాంచందర్రావు ప్రకటించారు. ఈ పరిణామంతో ఆయన నివాసం వద్దకు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పరిస్థితి అదుపులో ఉంచేందుకు పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!