

2026 నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు సాధించిన విజయం భారత కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ డెమొక్రాట్లు మెజారిటీ సాధించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫలితాలను ప్రస్తావిస్తూ భారత్‌లోనూ రాజకీయ మార్పు సాధ్యమేనని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘యెస్.. వి కెన్ టూ’ అంటూ తమ ఉత్సాహాన్ని చాటుతున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అమెరికా ఎన్నికల ఫలితాలను ట్రంప్‌కు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాతీర్పుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ప్రభుత్వాలను మధ్యలో ప్రశ్నించే అవకాశం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శామా మహమ్మద్ కూడా అమెరికా ఫలితాలపై స్పందిస్తూ భారత్‌లోనూ త్వరలో ఇలాంటి రాజకీయ మార్పు రావచ్చని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే లేదా ఆర్థిక పరిస్థితులపై తప్పుడు ప్రచారం చేసే ప్రభుత్వాలకు ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ప్రజల మద్దతు ఉంటే అసాధ్యమనుకున్న విజయాలు కూడా సాధ్యమవుతాయని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!