
జనరల్

2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ల నుంచి ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారాయి. కాంగ్రెస్‌లో రెండు సభలపైనా డెమొక్రాట్లకు పట్టు లభించడంతో అమెరికా రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఈ ఎన్నికల్లో పలువురు నేతలు చరిత్ర సృష్టించారు. మిచిగాన్ సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయ్యద్ విజయం సాధించారు. దీంతో అమెరికా చరిత్రలో తొలి ముస్లిం సెనేటర్‌గా ఆయన నిలవనున్నారు. మరోవైపు, జార్జియా గవర్నర్ ఎన్నికల్లో కీషా లాన్స్ బాటమ్స్ గెలుపొందారు. దీంతో ఆ రాష్ట్రానికి తొలి నల్లజాతీయురాలైన గవర్నర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!