
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొంటూ.. ప్రతి ఒక్కరూ ఆశావాదం, సానుకూలత, మంచితనంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్న సైనికుల అంకితభావాన్ని ఈ సందర్భంగా గుర్తుచేయనున్నారు.
దీపావళి సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ సైనికులతో సమయం గడపడం ద్వారా దేశ రక్షణలో వారి సేవలను గౌరవిస్తున్నట్లు మోదీ సందేశమిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!