

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి రోహిత్ నాయుడు అనూహ్యంగా ఎలిమినేట్ కావడం ఇప్పటికీ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎనిమిదో వారం వీకెండ్ ఎపిసోడ్‌లో ప్రేక్షకుల ఓటింగ్‌కు బదులుగా హౌస్‌మేట్స్ నిర్ణయం ఆధారంగా రోహిత్‌ను ఎలిమినేట్ చేయడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలంటూ #JusticeForRohit హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు మద్దతు తెలిపారు. తాజాగా అతడి రీఎంట్రీపై ఊహాగానాలు మొదలవడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజీత్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. "The Sun Will Shine Again" అంటూ ఆయన చేసిన ట్వీట్ రోహిత్‌ను ఉద్దేశించే అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే అభిజీత్ తన పోస్ట్‌లో రోహిత్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. షోలోకి వెళ్లకముందు రోహిత్‌కు అభిజీత్ మార్గనిర్దేశం చేయడంతో పాటు అగ్నిపరీక్ష ప్రక్రియలో అతడి ఎంపికలోనూ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో చరణ్, షాలినికి మరో అవకాశం లభించిన విషయాన్ని గుర్తుచేస్తున్న అభిమానులు.. రోహిత్‌కు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అతడి రీఎంట్రీపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!