

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని, సమర్థవంతమైన పోరాటం చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలోని ఆర్-9 ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జల వివాదాల ట్రైబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)తో పాటు అన్ని సమర్థ వేదికలపై తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. రాష్ట్రానికి దక్కాల్సిన జలవాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు.
సాగునీటి నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ పలు కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని, ఆశించిన స్థాయిలో ఆయకట్టు ప్రయోజనాలు రైతులకు అందలేదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించడం, వాస్తవ ఆయకట్టును సృష్టించడం, తెలంగాణ జలహక్కులను పరిరక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ఆర్-9 పథకం పరిశీలన సందర్భంగా నీటి వృథా, జాప్యం లేకుండా రైతుల పొలాలకు నీరు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!