

తెలంగాణ మంత్రివర్గం నుంచి తన తల్లి కొండా సురేఖను తప్పించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురై వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు ఉన్న కోపాన్ని తన తల్లి కొండా సురేఖపై చూపించారని ఆమె ఆరోపించారు. తన వ్యాఖ్యల వల్లే తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిసి ఉంటే, తాను ఆ రోజు అలా మాట్లాడేదాన్ని కాదని సుష్మిత ఆవేదన వ్యక్తం చేశారు.
తాను మాట్లాడిన మాటలకు తన తల్లిని బాధ్యురాలిని చేయడం ఎంతవరకు సమంజసమని సుష్మిత ప్రశ్నించారు. కొండా సురేఖ చేసిన ఒక్క తప్పునైనా చూపించగలరా అని నిలదీశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో తానైనా ఉండాలి, లేదా తన తల్లైనా ఉండాలనే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారుతారా అని ప్రశ్నించారు. సురేఖ బర్తరఫ్ అనంతరం సుష్మిత గతంలో రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఆమె చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!