
క్రీడలు

తెలంగాణ ఇప్పుడు బీజేపీ తదుపరి ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం సీట్లు గెలుచుకుందని, ప్రతి 100 మంది ఓటర్లలో 36 మంది బీజేపీకి ఓటేశారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో జాతీయ రహదారులు 2,400 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్లకు పెంచినట్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేసిన ఆయన, తన చివరి శ్వాస వరకు బీజేపీ జెండానే మోస్తానని అన్నారు. మోదీ దేశం కోసం నిరంతరం కష్టపడే నాయకుడని ప్రశంసించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!