

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఇందులో రాజకీయాలు లేదా కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన అంశాలు ఉంటాయనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అయితే అలాంటి వార్తలకు అఖిల్ పూర్తిగా చెక్ పెడుతూ, ఈ చిత్రానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాయలసీమ సంస్కృతి, స్థానిక నేపథ్యంతో తెరకెక్కిన కల్పిత కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలిపారు.
'లెనిన్' అనే టైటిల్ వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా అఖిల్ వివరించారు. రాయలసీమలో స్థానిక చరిత్ర కారణంగా పిల్లలకు లెనిన్ వంటి ప్రపంచ నాయకుల పేర్లు పెట్టడం సాధారణమని, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి కలిసిన 'లెనిన్ బాబు' అనే వ్యక్తి నుంచి ఈ పేరుకు ప్రేరణ లభించిందన్నారు. హీరో పాత్రలోని ధైర్యం, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబించేలా ఈ టైటిల్‌ను ఎంపిక చేశామని, దీనికి కమ్యూనిస్ట్ భావజాలంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, తిరుపతి-చిత్తూరు ప్రాంతాల నేపథ్యంతో సాగే ఈ కథపై మంచి అంచనాలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!